కలం, చండూరు: చండూరు (Chandur) మున్సిపాలిటీలోని హోటళ్లు, రెస్టారెంట్లలో మున్సిపల్ కమిషనర్ ఎల్. మల్లేశం ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హోటళ్లలో శుభ్రత, ఆహార నాణ్యత, వంటశాలలు, వ్యర్ధాల నిర్వహణ, తాగునీటి సౌకర్యాలను పరిశీలించారు. నిబంధనలను ఉల్లంఘించిన రెస్టారెంట్లపై రూ.12 వేల జరిమానా విధించారు. ఈ సందర్భంగా కమిషనర్ మల్లేశం మాట్లాడుతూ శుభ్రత పాటించి నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. అలాగే ప్లాస్టిక్ కవర్లను వినియోగించుకోవద్దని యాజమాన్యాలకు సూచించారు. ఈ తనిఖీలో మేనేజర్ జి. రాములు, సీనియర్ అసిస్టెంట్ ఎ. సాయి భారద్వాజ్, వార్డ్ ఆఫీసర్ బి. సాయిరాం, పర్యావరణ ఇంజినీర్ ఎం. అరవింద్ రెడ్డి, బిల్ కలెక్టర్లు జి. మహేశ్, జి. రమేశ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

