గిల్ సెంచరీ కొడితే నాపై ట్రోలింగ్: వెంకటేష్ అయ్యర్

క‌లం, స్పోర్ట్స్‌: శుభ్‌మన్ గిల్ (Shubman Gill) సెంచరీ చేసిన ప్రతిసారీ తాను దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నానని ఆర్సీబీ ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ (Venkatesh Iyer) సంచలన విషయాలు వెల్లడించారు. ఆకాష్ చోప్రా ‘బైఠ్ అండ్ బోల్’ పాడ్‌కాస్ట్ టీజర్‌లో తనపై వచ్చిన విమర్శలపై ఆయన స్పందించారు. 2022 ఐపీఎల్ వేలానికి ముందు కేకేఆర్ ఫ్రాంచైజీ గిల్‌ను విడుదల చేసి, వెంకటేష్ అయ్యర్‌ను దక్కించుకుంది. అప్పటినుంచి గిల్ సెంచరీ కొట్టినప్పుడల్లా కేకేఆర్ ఫ్యాన్స్ తనను టార్గెట్ చేసేవారని ఆయన తెలిపారు. ‘బంగారం కోసం చూసి వజ్రాన్ని పోగొట్టుకున్నాం’ అని తనను ఉద్దేశించి సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతుండేవారని అయ్యర్ చెప్పారు.

2026 వేలానికి ముందు కేకేఆర్ తనను రిలీజ్ చేసిన సమయాన్ని కూడా అయ్యర్ గుర్తు చేసుకున్నారు. కేకేఆర్ నిర్ణయం గురించి సహ యజమాని షారుఖ్ ఖాన్‌తో నేరుగా మాట్లాడానని వెల్లడించారు. కేకేఆర్ జెర్సీకి దూరం కాబోతున్నానని ముందే అర్థం చేసుకున్నానని స్పష్టం చేశారు.ఆ తర్వాత వేలంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్‌సీబీ జట్టు అయ్యర్‌ను కొనుగోలు చేసింది. అక్కడ అభిమానుల ఆదరణ, వాళ్ల అభిమానం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆయన చెప్పారు. మ్యాచ్‌లకు ముందు ఫ్యాన్స్ ఆర్‌సీబీ జెర్సీని పూజించడం ప్రత్యక్షంగా చూశానని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>