కలం, వెబ్‌డెస్క్: భారత వ్యతిరేక అల్లర్లు, విద్యార్థి నాయకుని హత్యతో అట్టుడుకున్న బంగ్లాదేశ్ (Bangladesh) కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయులకు వీసాల జారీని నిలిపివేసింది. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ తోపాటు అన్ని కాన్సులర్, వీసా సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. తదుపరి నోటీసు వచ్చే వరకు ఇది అమల్లో ఉంటుందని పేర్కొంది. వీసా ఇంటర్వ్యూలకు స్లాట్ బుక్ చేసుకున్నవాళ్లకు రీ షెడ్యూల్ చేస్తామని చెప్పింది. కాగా, బంగ్లాదేశ్ లోని నాలుగు వీసా సెంటర్లను భారత్ ఇప్పటికే మూసివేసిన సంగతి తెలిసిందే.


