కలం, వెబ్‌డెస్క్: పాకిస్తాన్‌పై చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ గెలిచిన బంగ్లాదేశ్ (Bangladesh) జట్టుకు ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ (ICC Rankings)లో పెద్ద ఊరట లభించింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన ఈ సిరీస్‌ను బంగ్లాదేశ్ 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్‌లో 259 పరుగులు చేసిన సీనియర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ 10 స్థానాలు ఎగబాకి 16వ ర్యాంకుకు చేరుకున్నారు. మరో బ్యాటర్ లిటన్ దాస్ 14 స్థానాలు మెరుగుపరుచుకుని 24వ ర్యాంకులో నిలిచారు.
బౌలింగ్‌లో ఎడమచేతి వాటం స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ 11వ స్థానానికి చేరి తన కెరీర్ బెస్ట్ రేటింగ్ సాధించారు. ఆల్రౌండర్ల జాబితాలో ఆయన 29వ స్థానంలో నిలిచారు. ఆఫ్ స్పిన్నర్ మెహిదీ హసన్ మిరాజ్ 25వ స్థానానికి, ఫాస్ట్ బౌలర్ నాహిద్ రాణా 54వ స్థానానికి చేరుకున్నారు. సిరీస్ ఓడినా, పాకిస్తాన్ పేసర్ ఖుర్రమ్ షాజాద్ 49వ స్థానంతో మళ్లీ ర్యాంకింగ్స్‌లోకి వచ్చారు. మరోవైపు నేపాల్, అమెరికా, స్కాట్లాండ్ ట్రై సిరీస్ తర్వాత వన్డే ర్యాంకింగ్స్‌లో మార్పులు వచ్చాయి.
మూడు మ్యాచ్‌లు గెలిచిన నేపాల్ జట్టులో ఆసిఫ్ షేక్ 81వ స్థానానికి, ఆల్ రౌండర్ దీపేంద్ర సింగ్ ఐరీ 91వ స్థానానికి చేరారు. బౌలర్లు సందీప్ లామిచానే 32వ స్థానాన్ని, లలిత్ రాజ్‌బన్షీ 47వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక స్కాట్లాండ్ ఆల్రౌండర్ బ్రాండన్ మెక్‌ముల్లెన్ 49వ ర్యాంకుకు చేరారు. అమెరికా స్పిన్నర్ నోస్తుష్ కెంజిగే 49వ స్థానానికి ఎగబాకగా, మిలింద్ కుమార్ ఆల్రౌండర్ల జాబితాలో 18వ స్థానాన్ని దక్కించుకున్నారు.

