దివ్యాంగులకు సేవ చేయడం మహా భాగ్యం: బండి సంజయ్

కలం , కరీంనగర్ బ్యూరో: అవయవ లోపం బలహీనత కాదని, జీవితాన్ని మరో కోణంలో గెలిచే శక్తిగా భావించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar)  సూచించారు. దివ్యాంగులకు సేవ చేయడం మహాభాగ్యమన్నారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సహకారంతో ADIP, ALIMCO పథకాల కింద కేంద్ర ప్రభుత్వ నిధులతో 466 మంది దివ్యాంగులకు రూ.84 లక్షల విలువైన 813 ఉపకరణాలను అందించారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఐవోసీఎల్ సీజీఎం వినీత్ కౌర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో దివ్యాంగుల కోసం రూ.100 కోట్లకుపైగా వెచ్చించి ఉపకరణాలు అందించాం. గతంలో కరీంనగర్, వేములవాడలో కూడా ప్రత్యేక శిబిరాలు నిర్వహించి పంపిణీ చేశాం. ఎంతమంది దరఖాస్తు చేసుకుంటే అంతమందికి అతి త్వరలో ఉప కరణాలు అందిస్తాం. కరీంనగర్ పార్లమెంటరీ పరిధిలో అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లలకు బాలామృతం, గుడ్డు సహా గర్భిణులకు పౌష్టికాహారం తదితరాలు అందించేందుకు కేంద్రమే సుమారు రూ.100 కోట్ల నిధులిస్తోంది’ అన్నారు.

శరీరం కాదు.. ఆత్మీవిశ్వాసం ముఖ్యం..

దివ్యాంగులను ఉద్దేశించి కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పూర్తిదాయక ప్రసంగం చేశారు. ‘అన్ని అవయవాలున్న వాళ్లే అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక దివ్యాంగుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. మనిషి శరీరంతో కాదు, మనసుతో గెలుస్తాడు. చేతులు లేకపోయినా చరిత్ర సృష్టించిన వారెందరో ఉన్నారు. కాళ్లు పనిచేయకపోయినా ప్రపంచాన్ని జయించిన వారు ఉన్నారు. కళ్లలో వెలుగు లేకపోయినా కోట్ల మందికి దారి చూపిన వారు ఉన్నారు. సమాజం కొన్నిసార్లు మిమ్మల్ని పరిమితులు ఉన్నవారుగా చూడొచ్చు. కానీ మీ పరిమితిని నిర్ణయించేది మీ శరీరం కాదు… మీ ఆత్మవిశ్వాసం. జీవితంలో మీకు ఎన్నో ఇబ్బందులు ఎదురైనా ఇంతవరకు వచ్చారు అంటేనే.. మీరు సాధారణ మనుషులు కాదు. ప్రతి ఉదయం మీరు చేసే పోరాటం. చాలామందికి జీవిత పాఠం. మీ చిరునవ్వు వెనుక బాధ ఉండొచ్చు. కానీ ఆ బాధను జయించే ధైర్యం కూడా మీలోనే ఉంది. కళ, క్రీడ, విద్య, టెక్నాలజీలో అద్భుతాలు చేయగలరు. మీరు ఎవరికీ తక్కువ కాదు. మీ జీవితానికి మీరే హీరో. మీ అడుగులు నెమ్మదిగా ఉండొచ్చు. కానీ మీ గమ్యం గొప్పది కావాలి. మీరు నిలబడితే ఇంకో దివ్యాంగుడికి ధైర్యం వస్తుంది’ అన్నారు.

ఒక్క ఏడాదే రూ.1600 కోట్లు

గత 12 ఏళ్లుగా దివ్యాంగుల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం ADIP, ALIMCO, Accessible India, కేంద్ర సామాజిక సాధికారత శాఖ ద్వారా వేలాది కోట్లను ఖర్చు చేస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ ఒక్క ఏడాదే రూ.1,600 కోట్లు కేటాయించిందన్నారు. గత యూపీఏ ప్రభుత్వంతో పోలిస్తే ఇది మూడు రెట్లు అధిక బడ్జెట్ అన్నారు. దివ్యాంగులకు ఉపకరణాలను అందజేయడంతో పాటు విద్య, ఉపాధి, డిజిటల్ ఐడీ, యాక్సెసిబుల్ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>