కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తల్లి శకుంతల గుండెపోటుకు గురయ్యారు. గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమెకు గచ్చిబౌలిలో ఉన్న మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. అత్యవసర చికిత్స నిమిత్తం డాక్టర్లు ఆమె గుండెకు స్టంట్ వేసినట్లు సమాచారం. బండి సంజయ్ ఆస్పత్రికి చేరుకొని తన తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆమె డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.

