నాకు, ప్రధానికి ఆ సమస్య లేదు: రాహుల్ కామెంట్లతో లోక్‌సభలో నవ్వులు

కలం, వెబ్ డెస్క్: లోక్‌సభలో రాహుల్ గాంధీ (Rahul Gandhi)  నవ్వులు పూయించారు. మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా రాహుల్ చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. మహిళా బిల్లుపై లోక్‌సభలో హాట్‌హాట్‌గా చర్చ జరగుతున్న విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ ఈ బిల్లును వ్యతిరేకిస్తూ సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇటీవల ప్రధాని చేసిన అప్పీల్‌ను గుర్తు చేస్తూ తనకు ప్రధాని మోదీకి భార్య లేదని గుర్తు చేశారు. ఈ విషయంలో ఇద్దరికీ సమస్య లేదని పేర్కొన్నారు.

మోదీ చేసిన అప్పీల్ ఇదే..

మహిళా బిల్లుకు (Women Reservation Bill) సంబంధించి ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల సభ్యులకు ఓ మెసేజ్ పెట్టారు. మహిళా బిల్లును ఆమోదించుకోవాల్సిన అవసరం అందరిమీద ఉందని సూచించారు. ప్రతి సభ్యుడు పెద్దమనసుతో ఆలోచించి బిల్లుకు మద్దతు పలకాలని కోరారు. అందరికీ ఇంట్లో తల్లులు, సోదరీమణులు, భార్యలు ఉంటారు కాబట్టి.. వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ బిల్లుకు మద్దతు పలకాలని మోదీ పిలుపునిచ్చారు.

రాహుల్ ఫన్నీ కౌంటర్

ప్రధాని చేసిన అప్పీల్‌కు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఫన్నీగా కౌంటర్ ఇచ్చారు. నరేంద్రమోడీకి, తనకు భార్య లేదని ఆయన గుర్తు చేయడంతో సభ్యులు ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఇదే సమయంలో తన సోదరి ప్రియాంకా గాంధీ గురించి కూడా రాహుల్ ప్రస్తావించారు. సభలో నా సోదరి ఐదు నిమిషాల్లో ఏం సాధించిందో చూశాను. నేను 20 ఏళ్ల రాజకీయ జీవితంలో అమిత్ షా జీని నవ్వించలేకపోయాను. కానీ నా సోదరి ఆయనను నవ్వించగలిగింది’ అంటూ రాహుల్ ప్రస్తావించారు. సభలో ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ.. ‘అమిత్ షానది చాణక్యుడు కూడా ఆశ్చర్యపోయే రాజకీయ చతురత” అంటూ ప్రియాంకా అనడంతో అమిత్ షా నవ్వారు.

Read Also: రోహిత్ వేముల చట్టం రూపకల్పన.. క్యాబినెట్ సబ్ కమిటీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>