రోహిత్ వేముల చట్టం రూపకల్పన.. క్యాబినెట్ సబ్ కమిటీ

కలం, వెబ్ డెస్క్: విద్యా సంస్థల్లో దళితుల పట్ల వివక్షను రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం రోహిత్ వేముల (Rohith Vemula) చట్టాన్ని తీసుకురానున్నట్లు ఇటీవల నిర్ణయం తీసుకున్నది. గత క్యాబినెట్ సమావేశంలో దీనిపై లోతైన చర్చ చేసింది. వీలైనంత తొందరగా అన్ని కోణాల నుంచి స్టడీ చేసి ప్రభుత్వానికి సూచనలు, సిఫారసులు చేయాల్సిందిగా క్యాబినెట్ సబ్ కమిటీ గురించి ప్రస్తావించింది. ఆ ఆలోచన మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటైంది. ఉన్నత విద్యా సంస్థల్లో వివక్షను నిరోధించే ఉద్దేశంతో రోహిత్ వేముల తెలంగాణ బిల్లుపై కసరత్తు మొదలైంది. ఈ చట్టం ఎలా ఉండాలో బిల్లులో వివరాలను పొందుపరిచేలా క్యాబినెట్ సబ్ కమిటీ చొరవ తీసుకోనున్నది. ఈ కమిటీలో డిప్యూటీ సీఎంతో పాటు మరో నలుగురు మంత్రులు సభ్యులుగా ఉన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నియమించిన క్యాబినెట్ సబ్ కమిటీ ఇదే
  • భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) – మెంబర్
  • ఉత్తమ్ కుమార్ రెడ్డి – మెంబర్
  • దామోదర్ రాజనర్సింహ – మెంబర్
  • దుద్దిళ్ళ శ్రీధర్ బాబు – మెంబర్
  • పొన్నం ప్రభాకర్ – మెంబర్
  • షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>