కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ జిల్లా హనుమకొండ (Hanumakonda) బాలసముద్రంలో శ్రీ భద్రకాళీ వీరభద్ర సేవా సమితి (Bhadrakali Veerabhadra Seva Samithi) ఆధ్వర్యంలో అమావాస్య సందర్భంగా అన్న ప్రసాద వితరణ (Annadanam) కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు అధికమవుతున్నా.. పేదల ఆకలి తీర్చాలనే లక్ష్యంతో ఈ సేవా కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి నెల అమావాస్య రోజున నిర్వహించే ఈ అన్న ప్రసాద వితరణలో సుమారు 600 మందికి భోజనం అందించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చిన వారు, హోటళ్లలో భోజనం చేయలేని పేదలు, కార్మికులు, కర్షకులు ఈ కార్యక్రమం ద్వారా భోజనం స్వీకరించారు.
ఈ సేవా కార్యక్రమం పట్ల లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేస్తూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. మండుటెండలో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం నిజమైన సేవా భావానికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడ్డారు. పేరు చెప్పని ఒక దాత స్వీట్స్ కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు డాక్టర్ పొడిచెట్టి విష్ణువర్ధన్, ఉల్లేంగుల మహేష్, సత్యనారాయణ రెడ్డి, చొల్లేటి శ్రీధర్, గౌరిశెట్టి ధనుంజయ, నారాయణ రెడ్డి, గోపాల్ రెడ్డి, పాములపర్తి కేశవ్ కుమార్, దేవునూరి రాధా కృష్ణ, ఎ లుగూరి రామ్మోహన్, అనుముల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: రోహిత్ వేముల చట్టం రూపకల్పన.. క్యాబినెట్ సబ్ కమిటీ
Follow Us On : WhatsApp

