కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ (Telangana) శాసనసభలో వందే మాతరం (Vande Mataram) పాడుతున్న సమయంలో ఎంఐఎం(AIMIM) పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సభ నుండి వాక్-అవుట్ చేశారు. వందేమాతరం గీతాన్ని ఆలపించడంపై నిరసన తెలుపుతూ సభ నుంచి వారు వాకౌట్ చేసారు. ఈ ఘటనపై బండి సంజయ్ (Bandi Sanjay) తీవ్రంగా స్పందించారు. వందే మాతరం పాడుతున్న సమయంలో సభను విడిచిపోవడం కేవలం నిరసన మాత్రమే కాదు.. దేశ గీతానికి, దేశ ఆత్మకు అవమానమని అన్నారు. భారతదేశానికి సంబంధించిన చిహ్నాల పట్ల ఎంఐఎం ఎందుకు వ్యతిరేకంగా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనతో ఎంఐఎం పార్టీ అసలు వైఖరి బయటపడిందని ఆయన విమర్శించారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చలు, వాదనలు మొదలయ్యాయి.
Read Also: అసెంబ్లీలో డ్రగ్స్‌పై చర్చ: సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: Facebook

