కార్యకర్త కాలు ఫ్యాక్చర్.. పరామర్శించిన బండి సంజయ్

కలం, కరీంనగర్: తిమ్మాపూర్ (Thimmapur) మండల కేంద్రానికి చెందిన సీనియర్ కార్యకర్త, మండల పార్టీ ఉపాధ్యక్షులు పబ్బ తిరుపతి ఇటీవల ప్రమాదవశాత్తూ ఆటోపై నుండి కిందపడి కాలు ఫ్రాక్చర్ అయింది. ప్రస్తుతం ఆయన కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay), ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తిరుపతికి ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తిరుపతికి మెరుగైన వైద్యం అందించాలని అక్కడి వైద్యులకు ఫోన్ ద్వారా సూచించారు.

ఈ సందర్భంగా బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు సుగుర్తి జగదీశ్వరాచారి మాట్లాడుతూ… కేంద్ర మంత్రి బండి సంజయ్ పవిత్రమైన భవానీ దీక్షలో ఉండి కూడా కార్యకర్త సంక్షేమాన్ని గుర్తుంచుకుని ఆరోగ్య పరిస్థితిపై వెంటనే స్పందించారని అన్నారు. ఆయనకు కార్యకర్తలపై ఉన్న ప్రేమాభిమానాలకు ఇది నిదర్శనమని కొనియాడారు. కార్యకర్త కష్టాల్లో ఉన్నాడని తెలిసిన వెంటనే స్పందించి ధైర్యం చెప్పడం అభినందనీయమని అన్నారు. ఈ విషయంలో  బండి సంజయ్ కుమార్ కు తిమ్మాపూర్ మండల బిజెపి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>