ప్రేమంటే ఇదేరా.. రష్యా నుంచి ప్రియుడి కోసం భారత్‌కు, గుడిసెలోనే జీవితం!

కలం, వెబ్ డెస్క్: వన్ నైట్ స్టాండ్, లివింగ్ రిలేషన్, డేటింగ్ నడుస్తున్న ఈ రోజుల్లో నిజమైన ప్రేమ దొరుకుతుందా? అంటే నో అనే చెప్పాలి. సంబంధాలన్నీ కనుమరగువుతున్న ప్రస్తుత రోజుల్లో దేశంకాని దేశం వచ్చి ప్రేమను దక్కించుకోవడం ఇది నిజంగా గ్రేట్ లవ్ స్టోరీయే (Love Story) అని చెప్పాలి. వెస్ట్రన్ కల్చర్ అంటేనే ఇండియన్స్‌కి ఓ రకమైన నెగిటివ్ అభిప్రాయం ఉంటుంది. అలాగే భారతీయుల పట్ల ఇతర దేశాల్లో చిన్న చూపు ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ రషన్య్ అమ్మాయి, ఇండియన్ కుర్రాడు ఒక్కటై తమ ప్రేమను ప్రపంచానికి చాటి చెప్పారు. ప్రేమకు ఆస్తిపాస్తులతో పనిలేదని బిహార్‌కు చెందిన రాహుల్ యాదవ్, రష్యా యువతి జూలీ నిరూపిస్తున్నారు.

కొన్ని సంవత్సరాల క్రితం ఉపాధి కోసం రష్యాకు వెళ్లిన రాహుల్ అక్కడ జూలీతో ప్రేమలో పడ్డాడు. అక్కడ వారిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే ఇద్దరి మధ్య రిలేషన్ బలపడుతున్న సమయంలోనే రాహుల్ భారత్‌కు తిరిగి వచ్చాడు.

ప్రియుడికి దూరంగా ఉండలేకపోయిన జూలీ.. ఆరు నెలల తర్వాత తన కుటుంబంతో కలిసి బిహార్‌లోని అతడి ఇంటికి చేరుకుంది. రాహుల్ గుడిసెలో నివసిస్తున్నా అతడితోనే జీవితమని స్పష్టం చేసింది. ఇరు కుటుంబాల అంగీకారంతో నవంబర్‌లో వీరిద్దరూ వివాహం చేసుకోనున్నారు. ప్రస్తుతం వీరిద్దరి లవ్ స్టోరీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రీయల్లీ గ్రేట్.. అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>