Mobile Popup Ad
Mobile Popup Ad

శంక‌ర్ గౌడ్‌ది ప్ర‌భుత్వ హ‌త్యే: బండి సంజ‌య్‌

క‌లం వెబ్ డెస్క్: ఆర్టీసీ స‌మ్మెలో ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసిన శంక‌ర్ గౌడ్ మృతి చెంద‌డంపై కేంద్ర మంత్రి బండి సంజ‌య్ (Bandi Sanjay) ఆవేద‌న వ్య‌క్తం చేశారు. శంక‌ర్ గౌడ్‌ది ముమ్మాటికీ ప్ర‌భుత్వ హ‌త్యేన‌న్నారు. ప్ర‌భుత్వం ఎందుకు కార్మికుల ప‌ట్ల ఇంత నిర్దాక్షిణ్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ప్ర‌శ్నించారు. రెండేళ్లుగా కార్మికుల స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. స‌మ్మెకు దిగినా స‌మ‌స్య‌ల ప‌రిష్క‌రించేందుకు ప్ర‌భుత్వం ముందుకు రావ‌డం లేద‌ని విమ‌ర్శించారు. ప్ర‌భుత్వం కార్మికుల స‌మ‌స్య‌ల‌ను గాలికి వ‌దిలేయ‌డంతోనే ఇలాంటి ప‌రిస్థితి ఎదురైంద‌న్నారు. కార్మికులు ఎవ‌రూ అధైర్య‌ప‌డ‌వ‌ద్ద‌ని, త‌మ స‌మ‌స్యలు ప‌రిష్కార‌మ‌య్యే వ‌ర‌కు అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>