కలం వెబ్ డెస్క్: ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) ఎస్సీ విభాగానికి సంబంధించి ముగ్గురు కొత్త రాష్ట్ర ఛైర్మన్ల నియామకానికి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ఆమోదం తెలిపినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ఈ నియామకాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ విభాగం ఛైర్మన్‌గా చిలక విజయ్ కుమార్ నియమితులయ్యారు. వీరితో పాటు పంజాబ్ రాష్ట్రానికి గుర్ ప్రీత్ సింగ్ లక్కీ పఖోకే, మహారాష్ట్రకు అనిరుధ్ ధోందూజీ వాంకర్లను ఛైర్మన్‌లుగా నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ నియామకాలు తక్షణమే అమలులోకి వస్తాయని ఏఐసీసీ పేర్కొంది.

