దేశద్రోహ శక్తుల కుట్రలను తిప్పికొట్టాలి: బండి సంజయ్

కలం, పెద్దపల్లి: దేశంలో విదేశీ నిధులతో అరాచకాలు సృష్టిస్తూ, బంగ్లాదేశ్ తరహాలో పార్లమెంట్‌తో పాటు ప్రధానమంత్రి నివాసాన్ని ముట్టడించేందుకు విధ్వంసకర శక్తులు కుట్రలు పన్నుతున్నాయని.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) తీవ్ర ఆరోపణలు చేశారు. ఇలాంటి దేశద్రోహ శక్తులకు చెంపచెళ్లుమనేలా దేశ ప్రజలంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లిలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త సుధాకర్ జీ మాతృమూర్తి కుమ్మరికుంట రాజేశ్వరి ఇటీవల మృతి చెందగా, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.

‘సేవ్ డెమోక్రసీ’ ర్యాలీలకు పిలుపు

విధ్వంసకర శక్తుల కుట్రలను తిప్పికొట్టేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) సమక్షంలో నవంబర్ 2న హైదరాబాద్‌లో, నవంబర్ 5న కరీంనగర్‌లో ‘సేవ్ డెమోక్రసీ(Save Democracy)’ పేరుతో భారీ ర్యాలీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు, యువత, ప్రజాస్వామ్యవాదులు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఓటర్ల జాబితా ప్రక్షాళనపై ప్రశ్నిస్తే అక్కసెందుకు?

కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ద్వారా మరణించిన వారి పేర్లను, ఒకే వ్యక్తికి వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న బహుళ ఓట్లను తొలగిస్తోందని బండి సంజయ్ (Bandi Sanjay) తెలిపారు. 2004లోనే మరణించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు కూడా ఓటర్ల జాబితాలో ఉండగా, తాజాగా దాన్ని తొలగించారని ఉదహరించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని బూత్‌ లెవల్‌ అధికారులు (బీఎల్‌ఓలు) ఈ ప్రక్రియ చేపడుతున్నప్పుడు ఇందులో బీజేపీకి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని మహేశ్వరం వంటి నియోజకవర్గాల్లో 2014కు ముందు అక్రమంగా వలస వచ్చి ఓటు హక్కుతో పాటు సంక్షేమ పథకాలు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను పొందుతున్న రోహింగ్యాల ఓట్లను తొలగిస్తుంటే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు ఎందుకు కడుపుమంట అని నిలదీశారు. స్థానిక పేదలకు, నిజమైన హిందువులకు న్యాయం జరగాలంటే బోగస్‌ ఓట్లను తొలగించాల్సిందేనని స్పష్టం చేశారు.

Also Read : కాంగ్రెస్‌ తప్పుడు నిర్ణయాలతో సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌పై లక్ష కోట్ల అప్పు: హరీశ్‌రావు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>