జీతాల పెంపునకై ఆసుపత్రి కార్మిక పోరుబాట

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంటాక్ట్ కార్మికుల జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 12 నుంచి రాష్ట్ర వ్యాప్త ధర్నా (AITUC Protest) నిర్వహిస్తున్నామని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సురేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో, మెడికల్ కళాశాలలో, వైద్య విధాన పరిషత్తు పరిధి ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య,సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సూపర్వైజర్, కార్మికుల (Govt Hospital Contract Workers) జీతాల పెంపు పాత టెండర్ల రద్దు పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కనీస వేతనం రూ.26 వేల పెంపునకై నవంబర్ 12 నుంచి ప్రభుత్వ ఆసుపత్రి కార్మికుల రాష్ట్రవ్యాప్త పోరుబాటకు సిద్ధం కావాలని సురేష్ పిలుపునిచ్చారు. మంగళవారం మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పారిశుద్ధ్య సెక్యూరిటీ పేషంట్ కేర్ సూపర్వైజర్ విభాగాల కార్మికుల జీతాల పెంపు సన్నాహక సమావేశం ఏఐటియుసి యూనియన్ కార్యాలయంలో జరిగింది.

ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య సెక్యూరిటీ పేషంట్ కేర్ సూపర్వైజర్ కార్మికుల జీవన ప్రమాణాలు సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరి విడనాడాలని అన్నారు. ప్రస్తుత కాలం చెల్లిన టెండర్లను రద్దు చేయకుండా దాదాపు 5 సంవత్సరాలుగా పాత ఏజెన్సీలనే కొనసాగించడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు వేతనాల చెల్లింపు నిర్వహణ ప్రైవేట్ ఏజెన్సీలకు మూడు సంవత్సరాల కాల వ్యవధితో ఎంపిక చేసే విధానం కొనసాగుతుందని.. ప్రస్తుత ఏజెన్సీలు 2024 జులై నుండి అక్టోబర్ నాటికి ముగిసిందని అన్నారు.

గడిచిన ఐదు సంవత్సరాలుగా ఆసుపత్రి కార్మికులకు ఒక్క పైసా కూడా జీతం పెంచలేదని అన్నారు. మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి 650 పడకల సామర్థ్యం అనుమతులు ఉన్న పారిశుద్ధ సెక్యూరిటీ పేషంట్ కేర్ సర్వీసెస్ మాత్రం కేవలం 453 పడకలకే పరిమితం చేశారని కానీ కార్మికులు వెయ్యి పడకల సామర్థ్యాన్నికి అనుగుణంగా సేవలు అందిస్తూ ప్రభుత్వం వైద్య సేవల లక్ష్యాన్ని కార్మికుల బుజస్కందాలపై వేసుకుని కేవలం 11,500 రూపాయల చాలీచాలని జీతంతో దుర్భరమైన జీవితం గడుపుతున్నారని అన్నారు. ఇప్పటికే వేతనాల పెంపుపై అనేక పర్యాయాలు అధికారులకు ప్రభుత్వానికి విన్నవించిన ఫలితం లేదని కావున నవంబర్ 12 నుండి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు సిద్ధమవుతున్నామని హెచ్చరించారు.

మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ప్రభుత్వ ఉద్యోగులు కాంట్రాక్టు సిబ్బంది మధ్య తగువలాట చిచ్చు పెడుతున్నారని సురేష్ మండిపడ్డారు. ఉద్యోగుల మధ్య అనైక్యత సృష్టించి ఆసుపత్రి వైద్య ఉద్యోగుల ఐక్యతను ఔన్నత్యాన్ని దెబ్బ తీసేందుకు కొద్ది మంది కుట్రలు పన్నుతున్నారని.. ఇలాంటి కుటిల యత్నాలు సబబు కాదని వాపోయారు.

కాంట్రాక్ట్ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగా ఒకటవ తేదీన జీతాల చెల్లింపు, వారాంతపు సెలవులు కాకుండా పండగ సెలవులు, జాతీయ సెలవులు, ఆర్జిత సెలవులు దాదాపు 23 దాకా ఇవ్వాలన్నారు. పీఎఫ్ ఈఎస్ఐ డెత్ క్లెయిమ్స్ నెలలోపే పూర్తి అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రతి సంవత్సరం ఒక నెల జీతాన్ని బోనస్ గా చెల్లించాలని, కార్మికుల పట్ల వేధింపులు ఆపాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆసుపత్రి బ్రాంచ్ అధ్యక్షులు రంగన్న, ప్రధాన కార్యదర్శి ఎస్. దేవానంద్,నేతలు, కార్మికులు బి.చెన్నయ్య,బాలకోటి, భీమయ్య,మన్యం, వీరాంజనేయులు, రాఘవేందర్,నైసన్ అంజలయ,యాదయ్య, నరసింహ,మున్నా, యుగంధర్ రెడ్డి, వెంకటయ్య, వెంకటేష్ నాయక్, కృష్ణ శ్రీనివాసులు, శంకర్, బాలరాజ్, గంగాధర్, పద్మ సత్యమ్మ నాగమ్మ సువర్ణ ఎల్లమ్మ శిరీష, వరలక్ష్మి, సునీత, లక్ష్మమ్మ, కవిత, జ్యోతి, మమత, నాగమణి, జమున, లక్ష్మి,వెంకటమ్మ, పద్మ, సునీత, మంజుల, చిట్టెమ్మ, సాయమ్మ, సునీత తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>