కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో భారీగా రొహింగ్యాలు ఉన్నారని.. వాళ్లకు పథకాలు ఇచ్చి బీజేపీని బలహీనపరుస్తున్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి శనివారం మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు హైదరాబాద్ ను సత్రంగా మార్చి రొహింగ్యాలకు ఓటు హక్కు కల్పించాయని బండి సంజయ్ ఆరోపించారు. రొహింగ్యాల ఓట్లతోనే ఈ పార్టీలు గెలిచాయని విమర్శించారు. రాష్ట్రంలో 20 లక్షలకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయన్న బండి (Bandi Sanjay).. హైదరాబాద్ లోని పాతబస్తీలో విదేశీయులకు ఓటు హక్కు కల్పించారన్నారు.

