Mobile Popup Ad
Mobile Popup Ad

కేంద్ర మంత్రి ఇంట్లో పోలీసుల సోదాలు..!

కలం, వెబ్ డెస్క్‌ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కోసం తెలంగాణ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసు (Bhagirath Case) నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. మొత్తం నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి హైదరాబాద్, కరీంనగర్, ఢిల్లీ నగరాల్లో ఏకకాలంలో వెతుకులాట సాగిస్తున్నాయి.

ఇందులో భాగంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేంద్ర మంత్రి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. కరీంనగర్‌లోని భగీరథ్ మేనమామ వంశీకృష్ణ నివాసంతోపాటు ఇతర బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. భగీరథ్ ఢిల్లీలోని కొందరు బీజేపీ నేతల రక్షణలో ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో తెలంగాణ పోలీసుల బృందం అక్కడికి కూడా  వెళ్లింది.

మరోవైపు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద భారీగా బలగాలు మోహరించాయి. భగీరథ్ ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారనే ప్రచారం కూడా బలంగా సాగుతోంది. ఈ రోజు సాయంత్రం లోపు ఆయనను మేడ్చల్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది. పోలీసులు ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేయడం, అదే సమయంలో ఆయన లొంగిపోనున్నారనే వార్తలు రావడం వల్ల ప్రస్తుతం తీవ్ర అయోమయ పరిస్థితి నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>