Mobile Popup Ad
Mobile Popup Ad

బండి భగీరథ్ కేసులో బాలిక వివరాలు బట్టబయలు.. పలువురిపై కేసు నమోదు!

కలం, వెబ్ డెస్క్ : బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ (Bandi Bhageerath) పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మైనర్ బాధిత బాలికకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ కావడంపై పేట్ బషీరాబాద్ పోలీసులు సీరియస్ అయ్యారు. ఇలాంటి చర్యలకు దిగిన వ్యక్తులపై జువైనల్ జస్టిస్ యాక్ట్, బీఎన్ఎస్ పోక్స్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు బాధిత బాలికకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు.. ఆమె తల్లి దండ్రులు వివరాలు సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్నాయనే విషయంపై మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నారు.

ఇందులో భాగంగా ఈ విధమైన కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్ ఖాతాల ఐడీలు, యూఆర్ఎల్ ను పోలీసులు గుర్తించారు. దీంతో బాధిత బాలిక వివరాలను బట్టబయలు చేసిన సదరు సోషల్ మీడియా నిర్వహకులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా పోక్సో యాక్ట్ కేసుల్లో భాగంగా బాధిత బాలిక వివరాలు బట్టబయలు చేసిన వారిపై కేసులు నమోదు చేశామన్న పేట్ బషీరాబాద్ పోలీసులు.. బాధిత బాలిక వ్యక్తిగత వివరాలు, తల్లి దండ్రులు వివరాలు బహిర్గతం చేయడం వల్ల బాధితురాలికి.. ఆమె తల్లిదండ్రులకి తీవ్రమైన మానసిక వేదన కలుగుతుందన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.

Read Also: భోజ్‌శాల మసీద్ కాంప్లెక్స్ కాదు.. హిందూ ఆలయమే: మధ్యప్రదేశ్ హైకోర్టు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>