పెట్రోల్ ధరలు పెంచిన బీజేపీకి బుద్ధి చెప్పాలి: బీఆర్ఎస్ నేత హరిప్రసాద్

కలం, కరీంనగర్ బ్యూరో: పెట్రోల్, డీజిల్ ధరలను నిరంతరం అడ్డగోలుగా పెంచుతూ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం భారం మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని కరీంనగర్ (Karimnagar) జిల్లా తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ (Gunjapadugu Hariprasad) అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అడ్డూ అదుపు లేకుండా ఈ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం ద్వారా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ఇంధన ధరల వల్ల సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజల జీవన‌ విధానంపై తీవ్రంగా దెబ్బ పడుతుందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కేంద్రం పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుందని, ఈ ధరల పెంపు ద్వారా ప్రజా రవాణాతో ముడిపడి ఉన్న అన్ని రంగాల కార్మికుల మీద, ప్రజల మీద, వ్యాపారుల మీద ప్ర‌భావం పడుతుందని పేర్కొన్నారు.

ఐదు‌ రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తరువాత ఇలా అన్యాయంగా పెట్రోలు, డీజిల్ ధరల పెంచార‌ని మండిప‌డ్డారు. ప్రజల దృష్టి మ‌ర‌ల్చ‌డానికి ఇంధ‌నాల‌ను పొదుపుగా వాడాల‌ని, కాన్వాయ్‌లు తగ్గించాలని మోదీ వ్యాఖ్యానించార‌ని ఆరోపించారు. ప్రజలు ఏది తినాలో, ఏది కొనుగోలు చేయాలో అన్నీ ర‌క‌ర‌కాల క‌థ‌లు చెప్పిన ప్రధాన మంత్రి తాను మాత్రం ఐదు రోజుల పాటు విదేశీ పర్యటన వెళ్తూ డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి పోయార‌న్నారు. దేశ ప్రజల‌ను ఇబ్బందుల్లోకి నెట్టివేసి ఆయ‌న‌ మాత్రం హంగు ఆర్భాటాలతో విదేశాలకు పోవ‌డం పాల‌న‌ను గాలికి వ‌దిలేయ‌డ‌మేన‌ని హరిప్రసాద్ (Gunjapadugu Hariprasad) విమ‌ర్శించారు.

Read Also: భోజ్‌శాల మసీద్ కాంప్లెక్స్ కాదు.. హిందూ ఆలయమే: మధ్యప్రదేశ్ హైకోర్టు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>