కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను (Balka Suman) నాంపల్లి పోలీసులు జడ్జి ఎదుట మరికాసేపట్లో హాజరుపర్చబోతున్నారు. హిమాయత్ నగర్‌లోని జడ్జి ఇంటి వద్దకు బాల్క సుమన్‌ను తీసుకొచ్చారు. రిమాండ్ విధింపుపై ఇరు పక్షాల మధ్య వాదనలు జరగబోతున్నాయి. జైలుకు వెళ్తారా..? బెయిల్ ఇస్తారా..? అనేది ఉత్కంఠగా మారింది. ఈ సందర్భంగా పోలీసులపై జడ్జి అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నేరుగా జడ్జి నివాసంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించడంతో అభ్యంతరం తెలిపారు. అపార్టుమెంట్ కింద వేచి ఉండాలని ఆదేశించారు. దీంతో, సుమన్ లాయర్లతో పాటు పోలీసులు కిందనే ఉండిపోయారు.
కింగ్ కోఠి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు..
అంతకుముందు నాటకీయ పరిణామాల మధ్య తెలంగాణ భవన్ వద్ద బాల్క సుమన్‌ను నాంపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో సుమారు 7 గంటల పాటు ప్రశ్నించారు. బాల్క సుమన్ వాంగ్మూలం నమోదు చేసి, కింగ్ కోఠి ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం, నేరుగా జడ్జి ఇంటికి తీసుకొచ్చారు.

