కలం,వెబ్ డెస్క్ : నందమూరి నటసింహం బాలకృష్ణ(Balakrishna) ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన “అఖండ 2” తో బాలయ్య మరో సూపర్ హిట్ అందుకున్నారు. సీనియర్ స్టార్ హీరోలందరి కంటే వరుస సక్సెస్ లు అందుకుంటూ బాలయ్య దూసుకుపోతున్నారు. బాలయ్యతో సినిమా చేసేందుకు యంగ్ డైరెక్టర్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అఖండ 2 తరువాత బాలయ్య తనకు గతంలో వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన గోపిచంద్ మలినేని డైరక్షన్ లో నటిస్తున్నాడు. ఇటీవల వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సెకండ్ మూవీని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ సినిమా బాలయ్య కెరీర్ లో 111వ చిత్రంగా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాను బిగ్గెస్ట్ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో బాలయ్య రెండు విభిన్న పాత్రలతో కనిపించబోతున్నారని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.
పీరియాడికల్ కాన్సెప్ట్ తో రానున్న ఈ సినిమా కథను మేకర్స్ మారుస్తున్నట్లు సమాచారం. దానికి కారణం ఇది హిస్టారికల్ మూవీ కావడంతో ప్రస్తుత వస్తున్న భారీ సినిమాలకు సంబందించి షూటింగ్ కి చాలా టైమ్ పట్టడం, అలాగే భారీ బడ్జెట్, ఓటిటి ఆదాయం తగ్గడం వంటి అంశాల మూలంగా సినిమాకి నష్టమే తప్పితే లాభం లేకపోవడం. అందుచేత ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ భారీ బడ్జెట్ మూవీ వర్కవుట్ కాదనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ ని పక్కకు పెట్టారని సమాచారం. అయితే భారీ సినిమాలా కాకుండా సింపుల్ కథతో సినిమాని పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనికోసం దర్శకుడు గోపిచంద్ మలినేని సరికొత్త కథని సిద్దం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై మేకర్స్ త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు.

Read Also: పవర్‌స్టార్‌తో.. ఆ డైరెక్టర్ మూవీ ఏమైంది?
Follow Us On: Youtube


