కలం, వెబ్ డెస్క్: నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కిన అఖండ 2 (Akhanda 2) భారీ కలెక్షన్లు రాబట్టడంలో విఫలమైంది. ఈ చిత్రం గత వారం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ ప్రేక్షకులను ఆకర్షించడంలో విఫలమైంది. మొదటి వారంలో అఖండ 2తోపాటు ఇతర దేశాల చిత్రాలు టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. బాలకృష్ణ మూవీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 2025లో ప్రీమియర్ అయిన డాకు మహారాజ్.. మొదటి వారంలోనే 2.4 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఇది అఖండ 2 కంటే ఎక్కువ.
నెట్‌ఫ్లిక్స్ (Netflix) డేటా ప్రకారం.. జనవరి 5 నుంచి 11 వరకు అఖండ 2 కేవలం 2 మిలియన్ల వ్యూస్ సాధించింది. థియేటర్లలో అఖండ-2 మూవీ రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా మాదిరిగానే తొలి వారంలో వసూళ్లు సాధించింది. కానీ నెట్‌ఫ్లిక్స్‌లో ఐదో స్థానంలో నిలిచింది. రిలీజ్‌కు ముందే బాలయ్య-బోయపాటి మూవీపై భారీ అంచనాలున్నాయి. కానీ మూవీ విడుదల ఆలస్యం కావడం, యావరేజ్ టాక్ వినిపించడంతో బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది.


