Mobile Popup Ad
Mobile Popup Ad

బట్లర్‌కు వరుణ్ చక్రవర్తి చెక్.. తడబడుతున్న ఇంగ్లాండ్​!

కలం, వెబ్​ డెస్క్​: భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్​ తడబడుతోంది. ఒకరి తర్వాత ఒకరుగా బ్యాటర్లు పెవిలియన్ బాట పడుతున్నారు. ఇంగ్లాండ్​ అభిమానులు తమ ఆశలన్నీ పెట్టుకున్న జాస్ బట్లర్ (25) కథ ముగిసింది. వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) సంధించిన అద్భుతమైన గూగ్లీకి బట్లర్ దగ్గర సమాధానం లేకపోయింది. 95 కిలోమీటర్ల వేగంతో వచ్చిన ఈ బంతిని బట్లర్ గుడ్డిగా ఊపగా, అది నేరుగా వెళ్లి మిడిల్ స్టంప్‌ను ఎగరవేసింది. బట్లర్ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లండ్ 5.5 ఓవర్లలో 64/3 స్కోరుతో ఉంది. 254 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టుకు భారత బౌలర్లు వరుస షాకులిస్తున్నారు. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా ఇప్పటికే చెరో వికెట్ పడగొట్టగా, వరుణ్ తన మొదటి ఓవర్లోనే కీలకమైన బట్లర్ వికెట్ తీసి మ్యాచ్‌పై భారత్ పట్టును మరింత బిగించాడు. ఫ్లైటెడ్ గూగ్లీతో బట్లర్‌ను వరుణ్ పూర్తిగా బోల్తా కొట్టించాడు. 17 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో పోరాడుతున్న బట్లర్ నిరాశగా వెనుదిరిగాడు. జాకబ్ బెథెల్ (26*) క్రీజులో ఉన్నప్పటికీ, టీమ్ ఇండియా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>