Mobile Popup Ad
Mobile Popup Ad

బాబర్‌కి ఇదే లాస్ట్ చాన్స్ కావొచ్చు.. అహ్మద్ షెహజాద్ షాకింగ్ కామెంట్స్

కలం, వెబ్ డెస్క్:  పాకిస్థాన్ క్రికెట్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ (Babar Azam) టీ20 భవిష్యత్‌పై పాక్ మాజీ బ్యాటర్ అహ్మద్ షెహ్‌జాద్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కొలంబో వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచింది. ఒక్క బ్యాటర్ కూడా ఆశించిన స్థాయిలో స్కోర్ చేయలేదు. ఈ క్రమంలోనే పాక్ క్రికెట్ కింగ్ అని పిలుచుకునే బాబర్ ఇన్నింగ్స్‌ కీలకంగా మారింది. బాబర్ కూడా ఈ మ్యాచ్‌లో పెద్దగా ఆడిందేమీ లేదు. కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్ బాబర్‌కు టీ20ల్లో ఆఖరి అవకాశం కావచ్చని షెహ్‌జాద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

టీ20 ఫార్మాట్‌లో తన విలువ నిరూపించుకునే కీలక ఘడియ ఇదే అయి ఉండొచ్చని షెహజాద్ అభిప్రాయపడ్డాడు. బాబర్ (Babar Azam) మరోసారి త్వరగా వెనుదిరగడంతో ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ టోర్నీలో ఇప్పటివరకు బాబర్ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై 15 పరుగులకే పరిమితమయ్యాడు. ఆ తర్వాత అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 32 బంతుల్లో 46 పరుగులు చేసి కొంత ఊపొచ్చినట్లు కనిపించింది. కానీ ఆరంభాన్ని పెద్ద స్కోరుగా మార్చలేకపోయాడు. తదుపరి కీలకమైన భారత్ మ్యాచ్‌లో పాకిస్థాన్ రెండు ఓవర్లలోనే 13 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది.

ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన బాబర్ కేవలం ఏడు బంతుల్లో ఐదు పరుగులు చేసి అక్సర్ పటేల్ బౌలింగ్ క్లీన్ బౌల్డ్‌ అయ్యాడు. భారత్‌తో జరిగిన ఆరు టీ20 మ్యాచ్‌ల్లో బాబర్ మొత్తం 110 పరుగులే చేయగలిగాడు. సగటు 22, స్ట్రైక్‌రేట్ 123.59 మాత్రమే. ఇందులో ఒక్క అర్ధశతకం ఉంది. ఈ ఓటమితో పాటు బాబర్ విఫలం కావడం పాక్ క్రికెట్ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీసింది. ఇక ముందున్న మ్యాచ్‌ల్లో అతని పాత్ర ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>