epaper
Wednesday, February 18, 2026
epaper

కొలంబో ఎక్స్‌ప్రెస్.. నక్వీ సైలెంట్ ఎగ్జిట్!

కలం, స్పోర్ట్స్: టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్–పాక్ మ్యాచ్ అంటే క్రికెట్ కంటే డ్రామానే ఎక్కువ. కానీ ఈసారి డ్రామాకు సెంటర్‌గా పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహ్సీన్ నఖ్వీ (Mohsin Naqvi)  ఉన్నారు. భారత్‌ను అల్లాడిస్తాం, మా జట్టు దెబ్బకు భారత్ గిలగిలలాడుతుందని కోతలు కోసిన నఖ్వీ.. కొలంబో వేదికగా జరుగుతున్న మ్యాచ్ మధ్యలో మెల్లిగా బయటకు జారుకున్నాడు. అదే ఇప్పుడు కీలకంగా మారింది. కోతలు కోసిన నఖ్వీ.. భారత్ ఊచకోత చూసి తట్టుకోలేక.. చుచ్చు పోసుకున్నాడంటూ సోషల్ మీడియా వేదికగా నఖ్వీ నక్కి నక్కి పారిపోయారంటూ ఒకటే ట్రోలింగ్ జరుగుతోంది.

స్కోర్‌బోర్డ్ చూస్తే ఓటమి ఖాయం అని అర్థకావడంతో నఖ్వీ మొఖం నెత్తురు చుక్కలేనట్లు అయిపోయింది. దాంతో ఏదో అర్జంట్ పనొచ్చినట్లు ఆదరబాదరగా అక్కడి నుంచి జంప్ అయిపోయాడు. అభిమానులకంటే ముందే పెవిలియన్ దాటేశారు! మ్యాచ్‌కు ముందు వరకు ఇదే నక్వీ .. బాయ్‌కాట్ బాంబులు, బెదిరింపులు, ఐసీసీ మీద ఒత్తిడి అంటూ పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు. “మా మాట వినకపోతే మ్యాచ్ ఆడం” అనే డైలాగులు కూడా కొట్టాడు. చివరకు మ్యాచ్ ఆడారు. కానీ ఆడింది మాత్రం పాక్ కాదు… భారత్! పాక్ బ్యాటర్లతో.. ఫుట్‌బాల్ ఆడింది.

భారత్ (Team India) 175 పరుగులు పెట్టింది. పాక్ ఆరుగురు స్పిన్నర్లతో “మాస్టర్ ప్లాన్” వేసింది. కానీ ఆ ప్లాన్ మొత్తం పవర్ కట్. టార్గెట్ చేధన మొదలైన కొద్ది సేపటికే వికెట్లు పడుతూ ఉండగా, నక్వీ ముఖంలో కలర్ మారింది. ఇంకేముంది… కొలంబో నుంచి “నక్వీ ఎక్స్‌ప్రెస్” బయల్దేరింది.పాక్ 114 పరుగులకే ఆలౌట్. భారత్ 61 పరుగుల ఘన విజయం. కానీ అసలు టాక్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రం నఖ్వీ ఎగ్జిట్!

సోషల్ మీడియాలో అయితే నెటిజన్లు ఫుల్ ఫైర్. “మ్యాచ్ చూడలేక కాదు… ఓటమి ముందే చూసి పారిపోయారు”. “బాయ్‌కాట్ ప్లాన్ ఫెయిల్… రిటర్న్ టికెట్ సక్సెస్” అంటూ మీమ్స్‌తో దండయాత్రే చేశారు. మొత్తానికి కొలంబోలో మ్యాచ్ అంతా వన్‌సైడెడ్‌గా జరిగింది. కానీ నక్వీ సైలెంట్ వాక్‌ఔట్ మాత్రం స్పెషల్ అట్రాక్షన్ అయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>