Mobile Popup Ad
Mobile Popup Ad

విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) ప్రభుత్వ మెడికల్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్, మత్తు పదార్థాల నివారణ, సైబర్ క్రైమ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు చట్టాలపై అవగాహనతోపాటు, సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా ఉండాలని సూచించారు. ర్యాగింగ్ తీవ్రమైన నేరమని, దానికి కఠినమైన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. మత్తు పదార్థాల వినియోగం విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తును దెబ్బ తీస్తుందని తెలియజేశారు. అలాగే సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

కళాశాల ప్రిన్సిపల్ క్రిష్ణ మోహన్, సూపరింటెండెంట్ నాగమోహన్ మాట్లాడుతూ.. కళాశాలలో ర్యాగింగ్‌కు జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తున్నామని, విద్యార్థుల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం ర్యాగింగ్‌, మత్తు పదార్థాలు, సైబర్ నేరాలకు వ్యతిరేకంగా విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సోమనాథం, ఈగిల్ సెల్ ఆర్‌ఎన్‌సీసీ వెంకటేశ్వరరావు, ఏసీపీ ప్రకాశ్, అడ్వకేట్ ఆరెట్టి నారాయణ పాల్గొన్నారు.

Read Also: వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>