కలం మెదక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) ద్వారా రైతులకు నీరు అందించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్ట్‌ను నిర్లక్ష్యం చేసి రైతులను ఇబ్బందులకు గురి చేసిందని పటాన్ చెరువు నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌ఛార్జి వెన్నవరం ఆదర్శ్ రెడ్డి (Vennavaram Adarsh Reddy) విమర్శించారు. గత మూడు సంవత్సరాలుగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై చేసిన ఆరోపణలు న్యాయస్థానం ముందు బట్టబయలు అయ్యాయని అన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు స్టే విధిస్తూ, ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించడం ప్రభుత్వం చేపట్టిన రాజకీయ కక్షసాధింపులకు గట్టి చెంపపెట్టుగా నిలిచిందని అన్నారు. పీసీ ఘోష్ నివేదిక రాజకీయ ఉద్దేశాలతో రూపొందించబడిందని ఆదర్శ్ రెడ్డి విమర్శించారు.
Read Also: ఏపీలో హనీ ట్రాప్.. వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలు
Follow Us On : WhatsApp

