సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ రైడ్స్

కలం, వరంగల్, కరీంనగర్ బ్యూరో: అవినీతి నిర్మూలించడానికి, ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకతను పెంచడానికి ఏసీబీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా మెరుపు దాడులు (ACB Raids) నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. భూముల క్రయ, విక్రయాల్లో ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం స్టాంపు డ్యూటీ ఫీజులు కట్టించడం లేదనే సమాచారం మేరకు ఇంచార్జ్ సబ్ రిజిస్టర్ (సీనియర్ అసిస్టెంట్) వెంకట్ లాల్‌ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. పక్కా సమాచారంతో అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

కరీంనగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో..

విజిలెన్స్ సోదాల్లో భాగంగా కరీంనగర్ సబ్‌రిజిస్టార్ కార్యాలయంలో గురువారం అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉన్నతాధికారుల సమాచారం మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. తనిఖీలలో భాగంగా కార్యాలయంలోని పలు విభాగాలకు చెందిన రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Read Also: కోతిని తరుమబోయి సజీవ దహనం.. షాకింగ్ వీడియో

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>