కలం, వెబ్‌డెస్క్: దేశమంతా వాహనదారులను పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు కలవరపెడుతున్నాయి. తాజాగా కేంద్రం మరోసారి లీటరు ఇంధనంపై రూ.2పైగా ధరను పెంచింది. దీంతో వాహనదారులు ఏం చేయాలో అర్థంకాక బిక్కమొగాలు వేశారు. అయితే తాజాగా ఒక ఆడి కార్ ఓనర్ (Audi Owner).. ఈ సమస్యకు అద్భుతమైన సొల్యూషన్ చెప్పారు. ఆయన చెప్పిన ఉపాయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ తీవ్ర చర్చలకు దారితీస్తోంది. ధనికులకు, సాధారణ ప్రజలకు ఒకే ధర కాకుండా.. రెండు రకాల పెట్రోల్ ధరలు ఉండాలని ఆయన సూచించారు.
పేదలు, ద్విచక్ర వాహనదారులు, టాక్సీ డ్రైవర్లకు తక్కువ ధరలో పెట్రోల్ అందించాలని అభిప్రాయపడ్డారు. తమలాంటి ధనికులకు పెట్రోల్ ధర ఎంత పెరిగినా పెద్దగా ప్రభావం ఉండదని ఆయన అన్నారు. ఖర్చు కంటే సౌకర్యానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. అందుకే సాధారణ ప్రజలకు ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం చౌక పెట్రోల్ ఇవ్వాలని, అవసరమైతే తాము అధిక ధర చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని ఆడి కార్ ఓనర్ తెలిపారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి.

