అటవీ ప్రాంతంలో పేకాట రాయుళ్ల గుట్టురట్టు.. 9 మంది అరెస్ట్!

​కలం, అశ్వరావు పేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట (Aswaraopeta) మండలం వేదాంతపురం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం మెరుపుదాడి చేశారు. పక్కా సమాచారంతో విరుచుకుపడిన పోలీసులు, పేకాట ఆడుతున్న 9 మంది రాయుళ్లను రౌండప్ చేసి అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేదాంతపురం అడవిని స్థావరంగా మార్చుకుని కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే సమాచారంతో టాస్క్‌ఫోర్స్ బృందం ఈ ఆకస్మిక దాడి నిర్వహించింది. ఈ దాడుల్లో నిందితుల నుంచి రూ.1,22,310 నగదుతో పాటు 2 కార్లు, 16 మోటార్‌సైకిళ్లు, 16 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిపై అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అటవీ ప్రాంతాలు, నిర్జన ప్రదేశాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, పేకాట స్థావరాల నిర్వాహకులు, పాల్గొనేవారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>