కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ పట్టణంలోని అమ్ము స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో జ్యోతినగర్‌లో ఆదివారం ఆషాడ మాసం గోరింటాకు సంబరాలను (Gorintaku Celebrations) డాక్టర్ పి. సుజాత రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, విద్యార్ధినులు పాల్గొని గోరింటాకు పెట్టుకొని ఆనందించారు. ఈ సందర్బంగా సుజాత రెడ్డి మాట్లాడుతూ.. ఆషాడ మాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం మనకు పెద్దలు నేర్పిన సాంప్రదాయం అని అన్నారు. భారతీయ సంప్రదాయంలో గోరింటాకు పెట్టుకోవడం అలంకరణ కోసమే కాదని.. ఆరోగ్య, ఆధ్యాత్మిక విశిష్టత కోసమే అన్నారు.
ఇది ముఖ్యంగా ఆషాడ మాసంలో వచ్చే వర్షాల ద్వారా వచ్చే సీజనల్ వ్యాధులు, నీటిలో నానడం వల్ల వచ్చే ఫంగస్ ఇన్ఫెక్షన్ నుండి గోరింటాకు కాపాడుతుందని, శరీరంలోని వేడిని హరిస్తుందని అన్నారు. ముఖ్యంగా గోరింటాకు సౌభాగ్యనిక ప్రతీక అన్నారు. పురాణాల ప్రకారం గోరింటాకు పార్వతి దేవి నుండి ఉద్భవించిందని అంటారు. కావున ఈ ఆషాడంలో గోరింటాకు అందరు పెట్టుకోవాలని కోరారు. ఇలాంటి కార్యక్రమం నిర్వహించినందుకు మహిళలు సుజాత రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ముద్దసాని అనూష, బొద్దుల భారతి, మయూరి, లావణ్య, రేణుక, సంధ్య, రోహిణి, జయ, లావణ్య, గౌరీ దేవి, అక్షయ రెడ్డి, రావికంటి మనోజ్ఞ, కొండూరి అనిల్ కుమార్, బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొల్లం లింగమూర్తి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

