కలం, జోగులాంబ గద్వాల: గద్వాల జిల్లా కేంద్రంలోని వాల్మీకి భవన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 1వ వుషు సాండా స్టేట్ కప్ (1st WUSHU SANDA State Cup) (బాయ్స్ అండ్ గర్ల్స్) క్రీడా పోటీలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ఈ ముగింపు వేడుకలకు గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన చిన్నారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా మెడల్స్, బహుమతులు అందజేశారు.
గద్వాల ఎమ్మెల్యే మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల జట్లు ఈ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచాయని అన్నారు. సినిమాలో చూసే ఫైట్స్ లాంటి ఈ క్రీడను గద్వాలలో చూడడం సంతోషకరంగా ఉందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని అభిలషించారు. క్రీడల వల్ల మానసిక దృఢత్వం, జ్ఞాపకశక్తి పెరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గద్వాల మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ తుమ్మల నరసింహులు, పూడూర్ కృష్ణ, మోసిన్, బొట్టు సుధాకర్, ఇసాక్, రామాంజనేయులు, నాగేంద్ర యాదవ్, వినోద్, కిరణ్, కిట్టు నిర్వాహకులు పాల్గొన్నారు.

