భావితరాల కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: ఎమ్మెల్యే

కలం, నిర్మల్: భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ (MLA Pawar Ramarao) అన్నారు. ఆదివారం స్వాధ్యాయ భక్తుల ఆధ్వర్యంలో దిదీజీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ‘వృక్షమందిర్ దిన్’ కార్యక్రమంలో భాగంగా భైంసాలోని తన నివాసంలో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పరమపూజ్య పాండురంగ శాస్త్రి ఆథవలే బోధనలు సమాజంపై విశేష ప్రభావం చూపాయని, ఆ మార్గంలో ముందుకు సాగుతున్న దిదీజీ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటడం గొప్ప సేవా కార్యక్రమమని అన్నారు. “వృక్షో రక్షతి రక్షితః” అనే సూత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టి, వన సంరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్వాధ్యాయ భక్తులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>