కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దేశంలోని అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులకు కీలక విజ్ఞప్తి చేశారు. నీట్ రీ-ఎగ్జామ్(NEET Re-Exam) రాస్తున్న విద్యార్థులందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు. జూన్ 21న జరిగే నీట్ రీ-ఎగ్జామ్‌కు హాజరయ్యే విద్యార్థులకు ప్రయాణ భారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని ఆయన సూచించారు. ఇప్పటికే బీహార్, హర్యానా రాష్ట్రాలు పంజాబ్ తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించాయని ఆయన తెలిపారు. మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇదే విధంగా ముందుకు రావాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల ప్రయాణ సమస్యలు తగ్గితే పరీక్షకు హాజరు మరింత సులభమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

