కలం, వెబ్ డెస్క్: ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, టీటీడీ బోర్డ్ సభ్యుడు ఆనంద్ సాయి (Anand Sai) కుమారుడు సందీప్‌ను హిట్ అండ్ రన్ కేసులో రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ఖాజాగూడ సమీపంలో నందులాల్ అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా, వేగంగా వచ్చిన ఇన్నోవా కారు ఢీకొట్టింది. దీంతో నందులాల్ తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోయాడు. దీన్ని గమనించిన జైద్ షా ఖాద్రి అనే యువకుడు నందులాల్‌ను ఆసుపత్రికి తరలిద్దామని ప్రయత్నించాడు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన మహీంద్రా కారు నందులాల్, జైద్ షా ఖాద్రిని బలంగా ఢీకొట్టింది. రెండోసారి తీవ్ర గాయాలతో నందులాల్ అక్కడికక్కడే మరణించాడు. జైద్ షా ఖాద్రి తీవ్రంగా గాయపడగా.. వాహనదారులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
సీసీ కెమెరాలతో గుర్తించి..
రెండు వరుసల ప్రమాదాలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మహీంద్రా కారు ఎవరిదని సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేపట్టారు. అది ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి (Art Director Anand Sai) కుమారుడిగా తేలడంతో వెంటనే అదుపులోకి తీసుకున్నారు. సందీప్ నిర్లక్ష్యంగా కారు నడిపి ఒకరి మరణానికి కారణమవడమే కాకుండా, ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయినట్లు గుర్తించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నామని, ఇన్నోవా కారు వివరాలు తెలుసుకుంటున్నామని రాయదుర్గం పోలీసులు తెలిపారు.
Also Read : హైవే బాధితులకు ‘గోల్డెన్’ అభయం.. నకిరేకల్‌లో ‘100 పడకల’ సంజీవని!
Follow Us On : WhatsApp

