ఉగ్రవాదులపై భారత భద్రతాదళాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఇందులో భాగంగానే జమ్మూకశ్మీర్‌లోని కుప్వాడా జిల్లాలో ఆపరేషన్ పింపుల్(Operation Pimple)ను ప్రారంభించాయి. కుప్వాడా జిల్లాలో ఉగ్రవాదులు తలదాచుకున్నారని సమాచారం అందడంతో భద్రతా సిబ్బంది ఆపరేషన్ చేపట్టారు. నగరమంతా జల్లెడపట్టడం ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదుల, భద్రతా సిబ్బంది మధ్య కాల్పులు జరిగాయి.
ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు భారత సైన్యానికి చెందిన చినార్ కోర్ వెల్లడించారు. ‘‘ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నిస్తున్నారని ఇంటెలిజెన్స్ కు సమాచారం అందింది. అందుకే శుక్రవారం ఆపరేషన్ పింపుల్(Operation Pimple) స్టార్ట్ చేశాం. ఈ క్రమంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతన్నాయి’’ అని చెప్పారు. ఆపరేషన్ పింపుల్‌తో పాటు ఆపరేషన్ ఛత్రు కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Read Also: ఓ పార్టీ 2 వేలు.. ఇంకోపార్టీ 3 వేలు?
Follow Us on: Youtube

