బీజేపీలోకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే?

కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ సీనియర్ నేత టీ.జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గులాబీ పార్టీలో మరో కీలక పరిణామం జరిగే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. దానికి కారణం ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి (Armoor Ex MLA Jeevan Reddy) కేంద్రమంత్రితో మంతనాలు జరపడమే. ఆర్మూర్ బీజేపీ నేతలతో కలిసి జీవన్ రెడ్డి కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ కావడంతో.. ఆయన బీజేపీలో చేరబోతున్నారా? అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి. ఆర్మూర్ లోని జీవన్ రెడ్డి మాల్ కు అధికారులు తాళాలు వేసినప్పటి నుంచి ఆయన బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూనే రాజకీయాల్లో సైలంట్ గా మారిపోయారు.

ఈ క్రమంలో జీవన్ రెడ్డి ఢిల్లీలోని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి (Pralhad Joshi) ఇంట్లో ప్రత్యక్షం కావడంతో ఆయన గులాబీ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నారనే టాక్ నడుస్తోంది. అయితే, జీవన్ రెడ్డి (Armoor Jeevan Reddy) కేవలం వ్యాపార పనుల కోసమే ఢిల్లీకి వెళ్లారా? లేక పోలిటికల్ టర్న్ తీసుకోబోతున్నారా? అన్న ప్రశ్నలు లేకపోలేదు. ఒకవేళ మాజీ ఎమ్మెల్యే కాషాయం కండువా కప్పుకుంటే.. టీ. జీవన్ రెడ్డి రాకతో జోరుగా ఉన్న గులాబీ పార్టీకి గట్టి దెబ్బే తగిలే అవకాశాలు ఉన్నాయి. కేంద్రమంత్రితో జీవన్ రెడ్డి భేటీ వెనుక అసలు కథ ఏంటీ? అనేది అటు బీఆర్ఎస్ తో పాటు బీజేపీలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Read Also: టాప్ 20 హాటెస్ట్ సిటీల్లో 19 ఇండియాలోనే

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>