కాక్రోచ్ పార్టీకి షాకిచ్చిన సుప్రీం కోర్ట్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: కాక్రోచ్ జ‌న‌తా పార్టీ (CJP)కి సుప్రీం కోర్టు (Supreme Court)లో చుక్కెదురైంది. ఇటీవ‌ల పార్ల‌మెంట్ ముట్ట‌డికి య‌త్నించిన నిర‌స‌న‌లో విద్యార్థుల‌ పోరాటాన్ని అణిచివేయ‌డాన్ని నిర‌సిస్తూ సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. అయితే ఈ పిటిష‌న్‌ను అత్య‌వ‌స‌రంగా విచార‌ణ‌కు తీసుకునేందుకు కోర్టు నిరాక‌రించింది. కోర్టు విలువైన స‌మ‌యాన్ని వృధా చేయ‌వ‌ద్ద‌ని పిటిష‌న్‌ర‌కు సీజేఐ సూర్య‌కాంత్ సూచించారు. పిటిష‌న‌ర్ త‌ర‌ఫు లాయ‌ర్ ఎన్‌టీఏ సంస్క‌ర‌ణ‌ల అంశాన్ని ప్ర‌స్తావించారు. దాడుల వీడియోలు కూడా ఉన్నాయ‌ని కోర్టుకు చెప్పారు. అయితే ఆ వీడియోలు చూసేందుకు త‌మ‌కు ఆస‌క్తి లేద‌ని, త‌మ స‌మ‌యాన్ని వృధా చేయ‌వ‌ద్ద‌ని సీజేఐ తేల్చి చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>