కలం, స్పోర్ట్స్: ఆర్సీబీ ఆల్ రౌండర్ కృణాల్ పాండ్యా (Krunal Pandya) తన సోదరుడు హార్దిక్ పాండ్యాతో ఉన్న విభేదాల వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాడు. తాజాగా జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. ఈ సందర్భంగా అన్నదమ్ములు ఇద్దరూ మైదానంలో ఎదురెదురు పడటం, హార్దిక్‌కు కృణాల్ బౌలింగ్ చేస్తున్న వీడియోలు వైరల్ కావడంతో వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందన్న చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.
ఈ నేపథ్యంలో ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో హోస్ట్ డానిష్ సైత్ అడిగిన ప్రశ్నలకు కృణాల్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా (Hardik Pandya)తో గొడవలు జరుగుతున్నాయా అని ప్రశ్నించగా.. కృణాల్ నవ్వుతూ అవన్నీ పుకార్లేనని కొట్టిపారేశాడు. తమ మధ్య అంతా సవ్యంగానే ఉందని స్పష్టం చేశాడు. డానిష్ సైత్ సరదాగా ‘కేన్, అండర్ టేకర్ కూడా అప్పుడప్పుడు కొట్టుకుంటారు కదా’ అని వ్యాఖ్యానించగా, కృణాల్ నవ్వుతూ ప్రతిదీ బాగుందని బదులిచ్చాడు.
మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ యువ ఆటగాడు ముకుల్ చౌదరిని స్లెడ్జింగ్ చేశారన్న ఆరోపణలపైనా కృణాల్ (Krunal Pandya) స్పందించాడు. తాను ఆ యువకుడిని ఏమీ అనలేదని, కేవలం ఆటలో భాగంగా సరదాగా మాట్లాడానని వివరించాడు. తన హెయిర్ స్టైల్ వల్ల తాను కోపంగా ఉన్నట్లు కనిపిస్తాను తప్ప, నిజానికి తాను చాలా సరదా మనిషినని చెప్పుకొచ్చాడు. యువ ఆటగాళ్లు లాంగ్-ఆన్ లేదా లాంగ్-ఆఫ్ మీదుగా సిక్సర్లు కొట్టాలని తాను కేవలం సలహా ఇచ్చానని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆర్సీబీ జట్టులో కృణాల్ పాండ్యా కీలక ఆటగాడిగా మారాడు. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో తన బౌలింగ్ శైలిని మార్చుకుని బౌన్సర్లతో బ్యాటర్లను ఆశ్చర్యపరుస్తున్నాడు. ఆర్సీబీ ఈ సీజన్ లో శుభారంభం చేయడంతో, తన ప్రదర్శన ద్వారా భారత జాతీయ జట్టులోకి మళ్ళీ ప్రవేశించాలని కృణాల్ ఆశిస్తున్నాడు. అతని కెరీర్ పురోగతిని అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు.
Read Also: మమతా బెనర్జీపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Follow Us On: Instagram

