కలం, వెబ్ డెస్క్: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) ఆశించిన స్థాయిలో రాణించట్లేదనే చెప్పాలి. తన ఐపీఎల్ (IPL) కెరీర్‌ను ముంబై నుంచి స్టార్ట్ చేసినా.. అతడికి అతి తక్కువ అవకాశాలే వచ్చాయి. ముంబై టీమ్ అతడినే బెంచ్‌కే పరిమితం చేసింది. అయితే ఈ ఏడాది టోర్నీలో లక్కో తరుపు అర్జున్.. బరిలోకి దిగనున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ముంబై ఇండియన్స్ (Mumbai Indians)లో ఉన్న సమయంలో బెంచ్‌కే పరిమితం కావడంపై అర్జున్ నోరువిప్పాడు. కొత్త జట్టులో చేరడం పట్ల తాను ఎంతో సంతోషంగా ఉన్నానని వెల్లడించాడు. 2021లో ముంబై ఇండియన్స్‌లో చేరిన అర్జున్, 2025 వరకు ఆ జట్టుతోనే ఉన్నారు.
అయితే ఈ ఐదేళ్ల కాలంలో ఆయనకు కేవలం ఐదు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడే అవకాశం దక్కింది. బెంచ్‌పై కూర్చోవడం ఎవరికీ ఇష్టం ఉండదని, కానీ కష్టపడటం తప్ప మనం ఏమీ చేయలేమని ఆయన పేర్కొన్నారు. అవకాశం వచ్చినప్పుడు సత్తా చాటడమే తన లక్ష్యమని అర్జున్ వివరించారు. రూ. 30 లక్షల ధరతో లక్నో జట్టులోకి ట్రేడ్ అయినందుకు తాను చాలా సంతోష పడ్డానని అర్జున్ తెలిపారు. కొత్త నగరం, కొత్త జట్టుతో పాటు లక్నోలోని మంచి ఆహారాన్ని ఆస్వాదించే అవకాశం దక్కుతుందని ఆనందం వ్యక్తం చేశారు. లక్నో కోచింగ్ స్టాఫ్ భరత్ అరుణ్, కార్ల్ క్రోల వద్ద బౌలింగ్ మెళకువలు నేర్చుకున్నానని, లాన్స్ క్లూజనర్, జస్టిన్ లాంగర్ తనకు పవర్ హిట్టింగ్‌లో శిక్షణ ఇచ్చారని వెల్లడించారు.
గత సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరలేకపోయిన లక్నో సూపర్ జెయింట్స్, ఈసారి ఎలాగైనా రాణించాలని పట్టుదలతో ఉంది. నేడు (ఏప్రిల్ 1) ఏకానా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌తో లక్నో తన ప్రయాణాన్ని ప్రారంభిస్తోంది. ఈ మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్‌కు తుది జట్టులో అవకాశం దక్కితే తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

