Mobile Popup Ad
Mobile Popup Ad

రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేసిన కోమటిరెడ్డి, ఉత్తమ్

కలం, వెబ్ డెస్క్: నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని బాలాజీ రైస్ మిల్లును మంత్రులు ఆకస్మికంగా తనిఖీ (Ministers Inspection) చేసి ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ లు రైస్ మిల్లు ఓనర్, హమాలీలతో ముఖాముఖి మాట్లాడారు. జిల్లాలో ధాన్యం ఎక్కువగా వస్తున్నందున ఇంకా బాగా కష్టపడి పని చేసి సహకరించాలని హమాలీలతో కోరారు. సాధ్యమైనంత ఎక్కువగా అన్లోడ్ చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

హమాలీలకు సంబంధించి ఏమైనా సమస్య ఉంటే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని మంత్రులు సూచించారు. జిల్లాలోని రైస్ మిల్లులన్నీ వారి మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు అన్లోడ్ చేసుకుంటే సమస్యలు రావని చెప్పారు. అదేవిధంగా కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యాన్ని వేగంగా పంపించేందుకు అవకాశం ఉంటుందని వివరించారు ఈ విషయంపై రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులు ఆలోచించి దాన్యం కొనుగోలను వేగవంతం చేయాల్సిందిగా మంత్రులు సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>