కలం, వెబ్ డెస్క్ : ఆరావళి పర్వత (Aravalli Hills) శ్రేణిలో మైనింగ్ పై కేంద్ర ప్రభుత్వం (Central Government) వెనక్కి తగ్గింది. పర్వత ప్రాంతాల్లో మైనింగ్ పై నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ మార్పుల మంత్రిత్వ శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆరావళి పర్వత ప్రాంతాల్లో ఇకపై ఎలాంటి మైనింగ్ కార్యకలాపాలు జరగవని స్పష్టం చేసింది.
ఇప్పటికే దెబ్బతిన్న పర్యావరణాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. మైనింగ్ కారణంగా ఏర్పడిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. కాగా, ఆరావళి పర్వత శ్రేణులకు నష్టం కలిగేలా మైనింగ్ మైనింగ్ చేపట్టడంపై దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వ్యక్తం అయిన విషయం తెలిసిందే. ప్రజల తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం Aravalli Hills మైనింగ్ పై వెనక్కి తగ్గింది.


