కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ శుభవార్త తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ల (APPSC Notifications)ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల నుంచి అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు.
మొత్తం 20 శాఖలకు సంబంధించిన ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ (APPSC Notifications) విడుదల కాగా, మరో 5 శాఖల పోస్టులకు రేపు, మిగిలిన 10 శాఖల పోస్టులకు ఈ నెల 24న నోటిఫికేషన్లు రానున్నాయి. వీటిలో 4 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, 23 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, 26 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, 20 డ్రాఫ్ట్స్ మెన్ గ్రేడ్-2, మహిళా శిశు సంక్షేమ శాఖలో 29 సూపర్ వైజర్ గ్రేడ్-1, 78 ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్స్, 15 డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్స్ గ్రేడ్-2, ఎండోమెంట్ విభాగంలో 104 గ్రేడ్-3 ఈవో పోస్టులను భర్తీ చేయనున్నారు.
Also Read : యుద్ధాలకు చెక్ పెట్టేందుకు.. కేఏ పాల్ శాంతి సందేశం
Follow Us On : WhatsApp

