జమ్మూ కశ్మీర్‌లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం

కలం, వెబ్ డెస్క్: జమ్మూ కశ్మీర్‌ (Jammu Kashmir )లో భారీ ఉగ్ర కుట్రను భద్రతా సిబ్బంది భగ్నం చేశారు. రాజౌరి జిల్లాలో లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందిన ముగ్గురు సానుభూతిపరులను అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీ సంఖ్యలో ఐఈడీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురిని జకీర్ హుస్సేన్, మహమ్మద్ ఆజాం, మహమ్మద్ ముస్తాక్‌గా గుర్తించారు. వీరు ఉగ్రవాదులకు అవసరమైన సామగ్రి, దాడులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నట్లుగా నిర్ధారించారు.

కశ్మీర్ లోయలో అశాంతికి కుట్ర..

దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముగ్గురు నిందితులు ఉగ్రవాదులు కశ్మీర్ లోయలోకి వచ్చేలా సహకరిస్తున్నారు. గతంలో పలు కీలక దాడులు వీరు ఇచ్చిన సమాచారం ఆధారంగానే జరిగినట్లు దర్యాప్తు అధికారులు స్పష్టం చేశారు. కశ్మీర్ లోయలో నిరంతరం అశాంతి ఉండేలా చూడటంతో పాటు పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరపడమే వీరి పని అని వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>