కలం, వెబ్ డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 58 యుద్ధాలు జరుగుతున్నాయని, దీనివల్ల 200 కంటే ఎక్కువ దేశాల్లో కోట్లాది మంది ప్రజలు నష్టాన్ని చవిచూస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ (KA Paul) ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధాల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు రెండు నుంచి మూడింతలు పెరిగాయని ఆయన తెలిపారు.
శాంతిని కాంక్షించే వారంతా ఒకే వేదికపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 23 సాయంత్రం అమెరికాలోని వాషింగ్టన్‌లో శాంతి సందేశాన్ని ఇవ్వనున్నట్లు కేఏ పాల్ ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్‌తో కలిసి సంయుక్తంగా నిర్వహించనున్నట్లు వివరించారు.

