ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు: భవేశ్ మిశ్రా

కలం, నిర్మల్ : ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఇసుక అక్రమ రవాణాపై చర్యలు, భూముల రీ సర్వే, ఇతర రెవెన్యూ అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా చేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జరిమానాలు విధించి, వాహనాలు జప్తు చేయాలన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడకూడదన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాలకు కేవలం టిజిఎండిసి లేదా మన ఇసుక వాహనం యాప్ ద్వారా మాత్రమే ఇసుక పర్మీషన్ పొందాలని తెలిపారు.

భూముల రీ సర్వే వివరాలను మండలాల వారీగా కలెక్టర్ (Bhavesh Mishra) సమీక్షించారు. జిల్లాలో 19 మండలాలకు 21 సర్వే పరికరాలు (రోవర్లు) ఉన్నాయని, స్పష్టమైన ప్రణాళికలతో గడువులోగా రీ సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకట మాధవ రావు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీవో దేవీదాస్, డిప్యూటీ కలెక్టర్ రాకేష్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>