Mobile Popup Ad
Mobile Popup Ad

బిగ్ అలర్ట్.. ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు

కలం, వెబ్ డెస్క్ : పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తాంధ్ర నుండి తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రాగల రెండు గంటల్లో ఏపీలోని పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్ష సూచన ఉందని (AP Rain Alert) వెల్లడించారు. ఈ మేరకు కొన్ని జిల్లాలకు రెడ్ , మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడుతాయని రెడ్ అలర్ట్ జారీ చేయగా.. అల్లూరి,విశాఖ, అనకాపల్లి జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద,భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని సూచించారు.

Read Also: ఘోర విషాదం.. పడవ బోల్తా పడి నలుగురు మృతి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>