కలం, వెబ్ డెస్క్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) పడే అవకాశముందని ఏపి విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ అల్పపీడనం మరో రెండు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో శనివారం అల్లూరి, ఏలూరు జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల బారీ వర్షాలు , మిగతా చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
తీరం వెంట గంటకు 40-50 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని .. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెట్లు, హోర్డింగ్ లు , పురాతన భవనాలు, కరెంట్ స్తంభాల మధ్య నిలబడవద్దన్నారు. ముఖ్యంగా మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

