కలం, వెబ్ డెస్క్ : ఏపీలో ఎండల తీవ్రత (AP Heatwave) రోజురోజుకు ముదురుతోంది. ఎండ వేడితో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మరో బాంబ్ పేల్చింది. గురువారం ( మే 28) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మరింత తీవ్రరూపం దాల్చనున్నాయని వెల్లడించింది. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధరణం కంటే గరిష్ట స్థాయికి చేరుకుంటాని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
119 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
ఉష్ణోగ్రతలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వడగాల్పుల (AP Heatwave) తీవ్రత కూడా ప్రమాదకరంగా మారనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 119 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. అలాగే 155 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ తీవ్రమైన ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు పగటిపూట బయటకు రాకపోవడమే మంచిదని పేర్కొన్నారు. మరోవైపు మరికాసేపట్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తాజాగా విపత్తుల నిర్వహణ సంస్థ తీవ్ర వడగాల్పులని హెచ్చరించింది. ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Read Also: భారత క్రీడా దిగ్గజం రంధీర్ సింగ్ కన్నుమూత
Read Also: డిజిటల్ విప్లవం

